యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఫస్ట్ వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన తండేల్ వర్కింగ్ డేస్ లో కూడా అదరగొడుతోంది. నాలుగు, ఐదవ రోజు బుక్ మై షోలో ఈ సినిమాకు లక్షకు పైగా టికెట్లు తెగడం విశేషం. దాంతో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించి మంచి వసూళ్లను దక్కించుకుంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో ఈ చిత్రం 80.12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. అటు నార్త్ అమెరికాలోనూ ఈ సినిమా స్టడీగా కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ఇటీవలే అక్కడ 750 K డాలర్ మార్క్ ను దాటేసింది. ఈ వారంలోపు మిలియన్ క్లబ్‌లో చేరనుంది. ప్రస్తుతం వేరే సినిమాల నుండి పోటీలేకపోవడం ఈ మూవీకి అడ్వాంటేజ్ కానుంది. దీంతో ఈ వారంలోగా తండేల్ 100కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది. తద్వారా నాగ చైతన్య కెరీర్‌లో మొదటి సారి ఈ ఫీట్ సాదించనున్నాడు.
ఇక ఇదిలావుంటే, తండేల్ ఘనవిజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ తాజాగా ‘తండేల్ లవ్ సునామీ’ పేరుతో గ్రాండ్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా హరజయ్యారు. అలాగే సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ స్పెషల్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఇంకా ఈ వేడుకలో నాగచైతన్య, శోభితా దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: