‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసారు మేకర్స్. దీనిలో భాగంగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు, టీజర్ మరియు ట్రైలర్ రిలీజ్ చేయగా.. వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘అటక్ మటక్’ అంటూ ఫుల్ జోష్‌లో సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేస్తోంది. ఒక పెళ్లి వేడుకలో విశ్వక్ లేడీ గెటప్ లో నాజూకు స్టెప్పులతో సందడి చేసాడు. ఇక ఈ పాటను నకాష్ అజీజ్, అదితి భావరాజు ఆలపించగా.. హీరో విశ్వక్ సేన్ స్వయంగా సాహిత్యం అందించడం విశేషం. ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేలావుంది.
ఇక ఇదిలావుండగా, మరోవైపు లైలా రీసెంట్‌గా సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘A” సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. అలాగే ఈ మూవీ మొత్తం 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్‌తో లాక్ చేయబడింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. షార్ట్ రన్ టైమ్ ఈ చిత్రానికి కలిసిరానుంది.
ఇక ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపిస్తుండటం విశేషం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌కి టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక విశ్వక్ లాస్ట్ రెండు సినిమాలు అనుకున్నంతగా రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. దాంతో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో నిర్మితమవుతున్న ఈ మూవీతో ఎలాగైనా గట్టిగా కొట్టాలని భావిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: