టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. కాగా ఇంతకుముందు వీరి కాంబోలో ‘భీష్మ’ అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ఈ తాజా అడ్వంచర్‌లో నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం రాబిన్‌హుడ్ నిర్మాణదశలో ఉండగా.. మేకర్స్ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారభించేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్ సహా అన్ని ప్రచార చిత్రాలకి మూవీ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయగా మంచి స్పందన అందుకుంది.
ఇక రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్ ‘వన్ మోర్ టైం’ సాంగ్ ని రిలీజ్ చేయగా మంచి మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సెకండ్ సింగిల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 14న ఈ పాట లిరికల్ వీడియో రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను నేడు విడుదలచేసింది. ఇందులో నితిన్, శ్రీలీల జంట తమ డ్యాన్స్ మూమెంట్స్‌తో అభిమానులకు కన్నులవిందు చేసింది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా ఈ ఎంటర్‌టైనింగ్ అడ్వంచర్ మార్చి 28న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: