యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు. కింగ్ అక్కినేని నాగార్జున ఈ వేడుక ముఖ్య అతిధిగా హరజయ్యారు. నిర్మాత అశ్వినీదత్ స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ వేడుకలో నాగచైతన్య, శోభితా దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ..”చైతు గారికి ఈ హిట్ రావడం నాగార్జున గారి ఎంత సంతోషంగా వుందో నాకు తెలుసు. ఆయన కంటే రెట్టింపు సంతోషంతో నేను, అభిమానులు వున్నాం. ఇక్కడితో మొదలు అన్నీ సిక్సర్లే. దేవిగారి మ్యూజిక్ రూపంలోనే ఈ కథ తెరపైకి వచ్చింది. ప్రతిఒక్కరూ ఈ సినిమాకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం. వాసు గారితో నా జర్నీలానే కొనసాగుతుంది.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అరవింద్ గారిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన స్థితప్రజ్ఞుడు. చాలా చక్కని తెలుగు మాట్లాడుతారు. ఆ తెలుగుని మా హీరో గారికి ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ లో గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని గారు చేసిన తెనాలి రామకృష్ణ కథ మళ్ళీ అభ్బుతంగా రాసి ఈ తరానికి తగ్గట్టుగా తీసుకొస్తాం. అరవింద్ గారికి థాంక్ యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: