ఈఏడాది మొదటి బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించింది సంక్రాంతికి వస్తున్నాం.సంక్రాంతికి రీజినల్ మూవీ గా వచ్చి ఏకంగా 300కోట్ల కు పైగా వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.అయితే ఈసినిమా ఓటిటి కంటే ముందు టీవీ లోకి రానుంది.జీ 5 డిజిటల్ హక్కులను దక్కించుకోగా జీ తెలుగు శాటిలైట్ రైట్స్ తీసుకుంది. రెండు జీ నెట్వర్కే కావడంతో టీవీ రేటింగ్స్ కోసం ముందుగా టెలివిజన్ ప్రీమియర్ ను వేయనున్నారు.ఆ తరువాత ఓటిటి లో కి రానుంది.ఇప్పుడొస్తున్న సినిమాలు అన్ని దాదాపు గా అన్ని ముందు ఓటిటిల్లోకి వచ్చిన తరువాత టీవీల్లోకి వస్తున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం డిఫ్రెంట్ గా ఫస్ట్ టీవీ లోకి రానుంది.ఈనెల చివర్లో ప్రీమియర్ ను ప్లాన్ చేస్తున్నారు.దాంతో రేటింగ్స్ పరంగా రికార్డు సృష్టించడం ఖాయం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా 5 వారం లోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ థియేటర్లలో డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఇప్పటివరకు సంక్రాంతికి వస్తున్నాం దాదాపు 110 కోట్ల లాభాలను తీసుకొచ్చి టాలీవుడ్ లో హైయెస్ట్ ప్రాఫిట్స్ ను తీసుకొచ్చిన సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది.ఈసినిమాతో వెంకటేష్ మొదటి సారి 300కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు సీనియర్ హీరోల్లో ఈ ఫీట్ సాధించిన మొదటి హీరోగా కూడా రికార్డు సృష్టించాడు.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో వి ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. దిల్ రాజు ,శిరీష్ ఈసినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























