విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో అత్యధిక వసూళ్ళు సాధించిన మొదటి తెలుగు రిజినల్ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా విక్టరీ వేడుకని గ్రాండ్‌గా నిర్వహించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ వేడుకుకు ముఖ్య అతిధిగా హాజరవగా.. డైరెక్టర్ హరీష్ శంకర్, వశిష్ట, వంశీ పైడిపల్లి తదితరులు స్పెషల్ గెస్ట్ లుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్‌తో పాటు మూవీ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌కి నిర్మాతలు షీల్డ్స్ అందించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “ఈ వేడుక చూస్తుంటే సంక్రాంతి మళ్లీ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సంక్రాంతి మా టీమ్ అందరికీ మెమొరబుల్. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా చాలా సరదాగా తీసాం. ప్రమోషన్స్ చాలా కష్టపడి చేశాం. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది. వెంకటేష్ గారితో త్వరలో మళ్లీ మా కాంబినేషన్ చేయాలి. మళ్లీ సంక్రాంతికి మీ ముందుకి వస్తాం. సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ సినిమా ఇంత రెవెన్యూ చేస్తుందని ఎవరికీ అంత చిక్కలేదు. ఆడియన్స్ కి థాంక్యూ. మీరు లేకపోతే ఈ విజయం లేదు’అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: