కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు దర్శకత్వం కూడా చేస్తుంటాడు. గతేడాది ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ‘రాయన్’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇది ఆయనకు మైల్ స్టోన్ 50వ మూవీ కాగా, ఇందులో ధనుష్ స్వయంగా నటించాడు. అయితే ఆయన సాధారణంగా తాను హీరోగా నటించే సినిమాలకు డైరెక్షన్ చేస్తుంటాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ, ఈసారి మాత్రం యువ నటీనటులతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు ధనుష్. తమిళంలో ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ (నీక్) అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ అనే టైటిల్‌తో వస్తోంది. ఇందులో పవిష్, వెంకటేష్ మీనన్, సిద్దార్థ శంకర్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, రమ్య రంగనాథ్ తదితరులు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా నుండి ‘గోల్డెన్ స్పారో’ అనే సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ రొమాంటిక్ సాంగ్ తమిళ్ వెర్షన్ ఇప్పటికే యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. 130 మిలియన్లకి పైగా వ్యూస్‌తో చార్ట్ బస్టర్ అనిపించుకుంది. ఈ క్రమంలో ఈ పాట తెలుగు వెర్షన్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను బాగానే ఇంప్రెస్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా జాబిలమ్మ నీకు అంతా కోపమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
స్టోరీ గురించి దర్శకుడు ధనుష్ వివరించడంతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కినట్టు అర్ధమవుతోంది. హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ సీన్స్, వారి ప్రేమకు పెద్దవారి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడం.. ఇలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. సీనియర్ యాక్టర్స్ శరత్ కుమార్, ఆడుకాలం నరేన్, శరణ్య కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేదిగావుంది.
ధనుష్ సినిమాలలో పాటలకు మంచి స్కోప్ వుంటుంది. దాదాపు దశాబ్దం క్రితం ‘3’ మూవీలో ఆయన స్వయంగా పాడిన ‘వై దిస్ కొలవెరి డి’ అనే సాంగ్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక ఇప్పుడు ఆయన తొలిసారి యంగ్‌స్టర్స్‌తో తీస్తున్న ఈ చిత్రంలో కూడా సాంగ్స్‌కి మంచి ప్రాముఖ్యతే ఉండనుంది.
జి.వి.ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న జాబిలమ్మ నీకు అంతా కోపమా చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ తెలుగులో విడుదలచేస్తోంది. ఫిబ్రవరి 21న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇదిలావుంటే ధనుష్ ప్రస్తుతం హీరోగానూ ఫుల్ బిజీగా వున్నాడు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’లో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ కాగా.. కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీనిపై భారీ అంచనాలే వున్నాయి. ఇక ఇది కాకుండా తమిళంలో ధనుష్ ‘ఇడ్లీ కడాయి’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఇళయరాజా బయోపిక్ కూడా లైన్లో వుంది. వీటితోపాటుగా హిందీలో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఇలా నాన్ స్టాప్ మూవీస్‌తో ధనుష్ దూసుకుపోతున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: