ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప-2’ ది రూల్. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ సరికొత్త రికార్డులు సృష్టించింది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈచిత్రం థ్యాంక్స్ మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈవేడుకలో చిత్రం యూనిట్ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ చేతుల మీదుగా షీల్డులు బహుకరించారు.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ”ఎన్ని మాటలతో వర్ణించినా చెప్పలేం, పుష్ప అనేది ఓ మ్యాజిక్. ఈ మ్యాజిక్ క్రియేట్ చేసిన హీరో, దర్శకుడు, మైత్రీ మూవీ మేకర్స్ అందరికీ కృతజ్క్షతలు. కష్టపడితే యూనివర్శ్ మనకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది.. దీనికి నిదర్శనం ఈ సక్సెస్. అందరి కష్టం, నిజాయితీకి ఈ పెద్ద బ్లాక్‌బస్టర్ అనేది నిదర్శనం. ఈ సినిమాకు అందరూ తమ మాగ్జిమమ్ ఎఫర్ట్ పెట్టారు. సుకుమార్ గారి విజన్.. పుష్పను ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చింది. ఆయన విజన్‌కు అల్లు అర్జున్ ప్రాణం పోశారు” అని అన్నారు.
కాగా ఈ సమావేశంలో మ్రైతీ మూవీ సీఈవో చెర్రీ, పంపిణీదారుడు శశి, హిందీ పంపిణీదారుడు అనిల్ తడాని, సునీల్, గణేష్ ఆచార్య, జగదీష్, పావని, మోనిక రామకృష్ణ, ఆదిత్య మీనన్, గగన్ విహారి, సీవీ రావు అజయ్, తారక్ పొన్నప్ప, విజయ్ పోల్లంకి, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, మహాలింగం, లక్ష్మీకాంత్, ముఖేష్ మెహతా, తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: