తండేల్ బుకింగ్స్ ఓపెన్

Thandel Bookings Open Now

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్‌ మూవీ ‘తండేల్’. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ ముమ్మురం చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ‘రాక్‌స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన మూడు పాటలు చార్ట్ బస్టర్ అనిపించుకున్నాయి. అలాగే తాజాగా పలు నగరాల్లో నిర్వహించిన ఈవెంట్లలో తెలుగు, తమిళం, హిందీ థియేట్రికల్ ట్రైలర్‌లను కూడా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్స్ సినిమాపై ఫీల్ గుడ్ మూవీ అనే భావన కలిగించడంతోపాటు ఒక్కసారిగా అంచనాలు మరింతగా పెంచేశాయి.

ఇక తండేల్ మరో మూడు రోజుల్లో విడుదలకానున్న సందర్భంలో చిత్ర యూనిట్ కీలక అప్డేట్ అందించింది. నేటినుంచి ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసినట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి టికెట్స్ బుక్ చేసుకునేందుకు ఒక లింక్ (https://linktr.ee/ThandelTickets) కూడా అందుబాటులో ఉంచారు. సో.. మూవీ లవర్స్, తండేల్ చూడటానికి ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోండి.

ఇక ఇదిలావుంటే, యూఎస్ఏ లో ఈ సినిమా 596కుపైగా లొకేషన్లలో విడుదలకానుంది. చైతన్య కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్. ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. సోలోగా రిలీజ్ అవ్వడం తండేల్‌కు మంచి అడ్వాంటేజ్ కానుంది. తండేల్ సినిమా నాగ చైతన్య కెరీర్‌లో నెవెర్ బిఫోర్ ఓపెనింగ్స్‌ను రాబట్టుకోనుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. హిట్ టాక్ వస్తే 100 కోట్ల మార్క్‌ను ఈజీగా దాటే అవకాశం ఉంది. మరి ఈ సినిమా నాగ చైతన్యకు ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి.

ఇక తండేల్ మూవీకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌. అలాగే షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందుతోంది. చైతూ తన కెరీర్‌లో తొలిసారి లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్ పోషిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.