నాగచైతన్య అమెజింగ్ యాక్టర్ – అమీర్ ఖాన్

Thandel Hindi Trailer Launch Event Aamir Khan Praises Naga Chaitanya

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైల‌ర్‌ను ముంబైలో లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. “మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు. అరవింద్ గారు నాకు బ్రదర్ లాంటివారు. తండేల్ ఫిబ్రవరి 7న వస్తుంది. అలాగే మా అబ్బాయి నటించిన సినిమా కూడా అదే రోజు వస్తుంది. అయినా పర్లేదు ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కి వస్తానని చెప్పాను. కథ బావుంటే ఎన్ని సినిమాలు అయినా ఆడియన్స్ చూస్తారు. తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఫెంటాస్టిక్‌గా ఉంది.”

“డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. మ్యూజిక్ ఫెంటాస్టిక్‌గా ఉంది. దేవిశ్రీ చేసిన ‘డింకచిక డింకచిక’ సాంగ్ నా ఫేవరెట్. బేసిక్‌గా నాకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు, కానీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. తండేల్ ట్రైలర్‌లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ వున్నాయి. చైతన్య ఫెంటాస్టిక్ యాక్టర్. ఐడియల్ కోస్టార్. తనతో వర్క్ చేయడం చాలా అమెజింగ్ ఎక్స్‌పీరియన్స్. తను మంచి హ్యూమన్ బీయింగ్. సాయి పల్లవి కూడా చాలా మంచి పెర్ఫార్మర్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’ అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.