యంగ్ హీరో విశ్వక్ సేన్ వచ్చే నెలలో లైలాతో వస్తున్నాడు.రామ్ నారాయణ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ గా రెండు పాటలు అలాగే టీజర్ రిలీజ్ అవ్వగా వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక థర్డ్ సింగిల్ కూడా విడుదలకానుంది.ఓహో రత్తమ్మ అంటూ సాగే ఈ సాంగ్ ను ఈనెల 31 న రిలీజ్ చేయనున్నారు.ఈరోజు ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ఫోక్ సాంగ్ ను పెంచాల్ దాస్ రచించడమే కాదు తనే పాడారు.ఇక ఈసినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు.దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లియోన్ జేమ్స్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.ఫిబ్రవరి 14న విడుదలకానుంది.ఇక ట్రైలర్ కట్ కూడా జరిగిపోయింది.కొద్దీ సేపటి క్రితం ట్రైలర్ ను చూశాను.మీ అందరితో ట్రైలర్‌ను పంచుకోవడానికి నేను వేచి ఉండలేకపోతున్నా.. ఇంత ఫన్నీ ట్రైలర్ నా కెరీర్ లో రాలేదు అని విశ్వక్ ట్వీట్ చేశాడు.ఇక విశ్వక్ లాస్ట్ రెండు సినిమాలు అనుకున్నంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయాయి.దాంతో లైలా తో సాలిడ్ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
ఇదిలావుంటే విశ్వక్ ఈసినిమా తరువాత ఫంకీ లో నటించనునున్నాడు.జాతి రత్నాలు ఫేమ్ కెవి అనుదీప్ ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు.త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ శ్రీకర స్టూడియోస్,ఫార్ట్యూన్ఫ్ ఫోర్ సినిమాస్ ఈసినిమాను నిర్మించనున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























