ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీ (30వ సినిమా)గా రాబోతున్న చిత్రం ‘మజాకా’. ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా చూపించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి విజయవంతమైన చిత్రాల రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ కథ, కథనం, మాటలు అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు రావురమేష్‌కు జోడీగా ‘మన్మధుడు’ ఫేం అన్షు నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా రావు రమేష్, సందీప్ కిషన్ మధ్య వచ్చే సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పొట్టచెక్కలయ్యేలా ఉన్నాయి. ఫిబ్రవరి 21న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి మొదటి పాట బ్యాచ్‌లర్ యాంథమ్‌ను విడుదల చేశారు మేకర్స్. బ్యాచ్‌లర్స్ జీవితంలో ఉండే స్ట్రగుల్స్, జాయ్స్‌ను హైలైట్ చేసేలా ఉన్న ఈ సాంగ్ కుర్రాళ్లకు చార్ట్‌బస్టర్ కానుంది. పాపులర్ రైటర్ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట కుర్రాళ్లకు ఎవర్‌గ్రీన్ ఫేవరెట్ కానుంది. ఈ పాటలో బ్యాచ్‌లర్స్ తమ జీవితంలో పడే వంట కష్టాలు, సింగిల్ షాపింగ్ ట్రిప్స్ వంటి వాటిని చాలాబాగా ఎలివేట్ చేశారు.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ధనుంజయ్ సీపాన ఎంతో హుషారుగా ఆలపించారు. కుర్రాళ్లందరికీ కనెక్ట్ అయ్యేలా తన గాత్రంతో కట్టిపడేశారు. లియోన్ జేమ్స్ అందించిన సంగీతం పాటకు మరింత ప్లస్ అయింది. రఘు మాస్టర్ అందించిన స్టెప్పులతో ఈ పాట సినిమాలో హైలైట్‌గా నిలవనుంది.
ఈ పాటను సందీప్ కిషన్-రావు రమేష్‌లపై వైజాగ్ బీచ్‌లో చిత్రీకరించారు. తండ్రీకొడుకుల బ్యాచ్‌లర్ జీవితంలో ఎత్తుపల్లాలను కళ్లకు కట్టినట్లు చూపించేలా తీశారు. వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను పడిపడినవ్వేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు ఈ బ్యాచ్‌లర్ యాంథమ్ బ్లాక్‌బస్టర్ బిగినింగ్‌లా చెప్పొచ్చు.
త్రినాధరావు నక్కిన విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ వివిధ క్రాఫ్ట్‌లలో భాగం కానున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా.. నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్‌గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, ఉమేష్ కేఆర్ బన్సల్ సంయుక్తంగా గ్రాండ్‌గా నిర్మిస్తుండగా.. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌లను అందించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: