డాకు మహారాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ పై ప్రశంసల వర్షం

Daku Maharaj Child Artist Gagana Geethika Gets Amazing Popularity

‘డాకు మహారాజ్’ లో నటించే అవకాశం రావడమే ఒక గొప్ప అవకాశం అనుకుంటే.. ఆ చిత్రంలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ప్రశంసలు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను’ అని పేర్కొంటోంది బాలనటి గగన గీతిక. “పిట్ట కొంచెం.. కూత ఘనం” అనే సామెతను గుర్తు చేస్తూ.. నాలుగున్నరేళ్ల ప్రాయంలోనే టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది ఈ గడుగ్గాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ తర్వాత ‘లాయర్ విశ్వనాధ్’ చిత్రంతో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు.. రెండవ మూవీ . “ఆర్ఆర్ఆర్, నారప్ప, 18 పేజీస్, తెల్లవారితే గురువారం” తదితర చిత్రాలలో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలతో తన ప్రతిభకు మరింత సానబెట్టుకుంది!! అలాగే “90’s మిడిల్ క్లాస్ బయోపిక్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, ప్రేమ విమానం” చిత్రాలలోనూ నటించి మెప్పించిన గగన.. ప్రస్తుతం ‘ఓదెల రైల్వే స్టేషన్-2’ చిత్రంలో తమన్న చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తోంది.

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు చదువును నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న గగనకు ప్రేరణ తన తండ్రి శ్రీతేజ. సినిమా రంగంపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీతేజ.. కుటుంబానికి అండగా ఉంటూనే సినిమారంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం యానిమేషన్ రంగాన్ని ఎంచుకున్నారు.

అయితే నటుడిగా కూడా తనకంటూ చిన్న ప్రత్యేకత సంపాదించుకునే దిశగా ఆయన ముందుకు సాగుతున్నాడు. ‘హైదరాబాద్ డ్రీమ్స్’ మూవీ లో లీడ్ రోల్ చేసి.. పలు మూవీస్ లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్‌తో మెప్పించిన శ్రీతేజ్.. ‘కృష్ణతులసి, ఎద లోయలో ఇంద్రధనస్సు’ వంటి ధారావాహికలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు!!

ఇక ఒకవైపు సంప్రదాయబద్ధంగా కూచిపూడి నేర్చుకుంటూనే.. మరోవైపు వెస్ట్రన్ డాన్స్ కూడా సాధన చేస్తున్న గగన.. తను నటించిన ‘డాకు మహారాజ్’.. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం, అందులో తను చేసిన పాయల్ అనే పాత్ర కథను కీలక మలుపు తిప్పేది కావడం పట్ల పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తోంది.

తనపై ఎంతో వాత్సల్యం చూపించి, తనతో కాంబినేషన్స్ సీన్స్ లోనూ బెరుకు లేకుండా నటించేలా ప్రోత్సహించిన బాలయ్యకు, ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్న గగన.. భవిష్యత్తులో మంచి పెర్ఫార్మర్‌గా పేరు గడించాలని ఆశీర్వదిద్దాం!!

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.