విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ భీమవరంలో బాక్సాఫీస్ సంబరం ఈవెంట్ నిర్వహించింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మల్యే కామినేని శ్రీనివాసరావు అతిధులుగా పాల్గొనగా.. మూవీ టీంతో పాటు భారీగా హాజరైన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరో విక్టరీ వెంకటేష్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “హాయ్ భీమవరం అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం.. వచ్చాం, కొట్టాం. ఇదంతా మీదే. భీమవరం ప్రేక్షకులు ఎప్పుడూ నా గుండెల్లో వుంటారు. ఇది మంచి హిట్ సినిమా చేస్తున్నాం అనుకున్నాం. కానీ దీన్ని మీరు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేసినందుకు థాంక్ యూ. వంద, రెండు వందలు, మూడు వందలు కోట్లు అంటున్నారు. ఇది మీరు ఇచ్చారు.”
“ఈ సినిమా క్రెడిట్ అనిల్ అండ్ టీంకి దక్కుతుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్‌కి థాంక్ యూ. ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ మళ్ళీ రాదు. ఐశ్వర్య, మీనాక్షికి మరిన్ని హిట్లు రావాలని కోరుకుంటున్నాను. అందరి హీరో అభిమానులకు థాంక్ యూ. మీ ప్రేమ ఇలానే వుంటే మళ్ళీ సంక్రాంతికి వస్తాం. మరో బ్లాక్ బస్టర్ ఇస్తాం. నిర్మాతలు దిల్ రాజు అండ్ శిరీష్‌కి థాంక్స్. అందరికీ పేరుపేరునా థాంక్ యూ” అని అన్నారు హీరో వెంకటేష్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: