అప్పట్లో ఆయన సినిమా చూసి విజల్స్ వేశాను

Sankranthiki Vasthunam Director Anil Ravipudi Says, I am Big Fan of Victory Venkatesh

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలైన అన్నిచోట్లా హౌస్ ఫుల్ బోర్డులతో, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ భీమవరంలో బాక్సాఫీస్ సంబరం ఈవెంట్ నిర్వహించింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మల్యే కామినేని శ్రీనివాసరావు అతిధులుగా పాల్గొనగా.. మూవీ టీంతో పాటు భారీగా హాజరైన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “హలో భీమవరం. అందరికీ బిగ్ థాంక్స్. బీమ్స్ గోదారి గట్టు పాట ఈ సినిమా సందడి మొదలైయింది. ఈ సినిమా పెద్ద హిట్ అయితే చాలు అనుకున్నాం. కానీ సినిమాని మీరు ఎక్కడితో తీసుకెళ్ళి పెట్టారు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ఆడియన్స్ కి బిగ్ థాంక్ యూ. ఎస్విసి బ్యానర్ నా ఫ్యామిలీ. ఇది వారితో ఆరో సినిమా. దిల్ రాజు గారికి శిరీష్ గారికి థాంక్ యూ. టీం అందరికీ థాంక్ యూ.”

“మా విక్టరీ వెంకటేష్ గారికి చాలా థాంక్. ఈ సినిమా క్రెడిట్ ఆయనే దక్కుతుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. నేను వెంకటేష్ గారి అభిమానిని. ఆయన సినిమా చూసి విజల్స్ వేశాను. ఆయనలా జుట్టు పెచుకున్నాను. ఆయన సినిమాకి డైరెక్టర్ చేయడం గ్రేట్ హానర్. థాంక్ యూ సార్. పద్మభూషణ్ అవార్డ్ అందుకొనున్న బాలయ్య గారికి మా సినిమా తరపున బిగ్ కంగ్రాట్స్. ఈ సంక్రాంతిని మర్చిపోలేను. మీ ఆశీస్సులతో కుదిరితే ఇంకో సంక్రాంతికి వస్తా” అని అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.