ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంగ్ రన్ లో అదరగొడుతుంది.50 రోజులకు చేరువైనా ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఇక మూడు రోజుల క్రితం 20 నిమిషాల సీన్లను యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తో రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఫస్ట్ టైం చూసిన వారు మరోసారి థియేటర్లకు వస్తున్నారు.నైజాంలో టికెట్ ధరలను తగ్గించడం కూడా అడ్వాంటేజ్ అయ్యింది అయితే సంక్రాంతి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను ఆక్రమించుకోవడంతో పుష్ప 2ను లిమిటెడ్ స్క్రీన్ లలో ప్రదర్శిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే రీలోడెడ్ వెర్షన్ ను కొంచెం ముందుగా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది.ఇంకా ఎక్కువగా కలెక్షన్స్ ను రాబట్టుకునే ఛాన్స్ ఉండేది. ప్రస్తుతం వున్న ట్రెండ్ చూస్తుంటే ఈసినిమా ఫుల్ రన్ లో 1850 కోట్ల మార్క్ ను టచ్ చేసేలా వుంది. ఇప్పటికే ఈసినిమా ఇండియన్ ఇండస్ట్రీ హిట్ రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే .అలాగే హిందీలో 800కోట్లకుపైగా వసూళ్లతో ఆల్ టైం గ్రాసర్ గా కూడా రికార్డు నెలకొల్పింది.ఇక ఓటిటి విషయానికి వస్తే ఈనెల చివర్లో స్ట్రీమింగ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.అన్ని భాషలకు గాను డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.
సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటించగా రష్మిక హీరోయిన్ గా చేసింది.రావు రమేష్ ,జగపతి బాబు ,అజయ్ కీలక పాత్రల్లో నటించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: