గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Shares Good News With Fans

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్‌ నటుడు ఇటీవలే ‘క’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మరో లేటెస్ట్ మూవీ ‘దిల్ రుబా’. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించగా.. మరో నటి నజియా డేవిసన్ కీలక పాత్రలో కనిపించనుంది. విశ్వ కరుణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలావుంటే, తాజాగా ఈ యంగ్ హీరో తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పారు. కాగా కిరణ్ ఇటీవలే సహనటి రహస్య గోరక్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే వారు తల్లిదండ్రులు కాబోతున్నారు. కిరణ్ సతీమణి రహస్య ప్రస్తుతం 2 నెలల గర్భవతి. ఈ మేరకు విషయాన్ని స్వయంగా కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా భార్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.