హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రాబిన్ హుడ్.శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.నితిన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమా గత ఏడాది డిసెంబర్ లో విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు.ఇక ఈరోజు న్యూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.మార్చి 28న రాబిన్ హుడ్ థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అదే రోజున పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ విడుదలకావాల్సి వుంది.కానీ రాబిన్ హుడ్ ఇప్పుడు అదే డేట్ ను అనౌన్స్ చేయడం తో హరి హర వీరమల్లు వాయిదా పడ్డట్లే.ఎందుకంటే నితిన్ ,పవన్ కు వీరాభిమాని.దానికి తోడు ఆ సినిమాకు పోటీ గా విడుదలచేసే దైర్యం చేయలేరు.సో హరి హర వీరమల్లు వాయిదా పడతుందనే రాబిన్ హుడ్ కి ఆ డేట్ ను లాక్ చేశారు.త్వరలోనే హరి హర వీరమల్లు రిలీజ్ విషయంలో క్లారిటీ రానుంది.
రాబిన్ హుడ్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఇంతకుముందు నితిన్,వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అనిపించుకుంది.దాంతో రాబిన్ హుడ్ పై మంచి అంచనాలు వున్నాయి.
ఇక ప్రస్తుతం నితిన్ ఈసినిమాతోపాటు తమ్ముడు అనే సినిమా కూడా చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈసినిమా మహాశివరాత్రికి విడుదలకానుందని ఇంతకుముందే మేకర్స్ ప్రకటించారు.అయితే రాబిన్ హుడ్ వెనక్కి వెళ్లడంతో తమ్ముడు రిలీజ్ డేట్ మారే అవకాశాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: