రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటరైనర్ గా వచ్చిన మ్యాడ్ సూపర్ హిట్ అనిపించుకుంది.నార్నె నితిన్, సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటించారు.ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ తో తెరక్కుతుండగా దాదాపు ఫస్ట్ పార్ట్ లో వున్నవారే ఇందులోనూ కనిపించనున్నారు. సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.మార్చి 29న ఈ సినిమా విడుదలకానుంది.అంతకన్నా ఒక్క రోజు ముందు నితిన్ రాబిన్ హుడ్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత ఏడాది మార్చి 29న వచ్చిన టిల్లు స్క్వేర్ 100కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ అయ్యింది.ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. మ్యాడ్ స్క్వేర్ ను కూడా ఇదే సంస్థ నిర్మిస్తుంది.దాంతో సెంటిమెంట్ గా అదే డేట్ ను లాక్ చేశారు.టిల్లు స్క్వేర్ కూడా సీక్వెలే.మరి మ్యాడ్ స్క్వేర్ కి కూడా ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.నిజానికి మార్చి లో విజయ్ దేవరకొండ 12వ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో మ్యాడ్ స్క్వేర్ ను దించుతున్నారు.
కళ్యాణ్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.మ్యాడ్ కి కూడా ఆయనే సంగీతం అందించగా సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.త్వరలోనే మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























