ది గోట్ తరువాత తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన 69వ సినిమాలో నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చెన్నై లో జరుగుతుంది.హెచ్ వినోత్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.ఇక ఈసినిమా తెలుగు సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరి కి రీమేక్ గా వస్తుందని రీసెంట్ గా ప్రచారం జరిగింది.నిర్మాతలు భగవంత్ కేసరి రీమేక్ రైట్స్ తీసుకొని విజయ్ 69వ సినిమాను రీమేక్ చేస్తున్నారని వార్తలు రాగ ఈ వార్తలపై తాజాగా డైరెక్టర్ హెచ్ వినోత్ స్పందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దళపతి 69 సినిమా 200 శాతం విజయ్ సినిమా.ఇది దేనికి రీమేక్ కాదు.పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానుందని క్లారిటీ ఇచ్చాడు.ఇందులో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి, మమితా బైజు కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమా అక్టోబర్ లో థియేటర్లలోకి రానుంది.
ఇక విజయ్ ఈసినిమా తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ గా బిజీ కానున్నాడు.ఇప్పటికే తను పార్టీ కూడా పెట్టిన విషయం తెలిసిందే.2026 తమిళనాడు అసెంబ్లీ ఎలెక్షన్స్ టార్గెట్ గా బరిలో నిలువనుంది విజయ్ పార్టీ.దాంతో వీలైనంత తొందరగా 69వ సినిమాను కంప్లీట్ చేసి పొలిటికల్ గా యాక్టీవ్ అవ్వాలని చూస్తున్నాడు విజయ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: