బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ ల కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ మరో 6రోజుల్లో థియేటర్లలోకి రానుంది ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ కు యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ లో బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. బాబీ డియోల్ ను ఈసినిమాలో పవర్ ఫుల్ విలన్ గా చూపిస్తున్నాడు బాబీ.ముఖ్యంగా విజువల్స్ విషయంలో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.యూట్యూబ్ లో ఇప్పటివరకు కోటి వ్యూస్ దాటాయి. ఓవరాల్ గా కీలకమైన ట్రైలర్ ను సూపర్ గా కట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ట్రైలర్ చూస్తుంటే బాలకృష్ణ ఇందులో డ్యూయెల్ రోల్ లో నటించినట్లు వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మొన్న యూఎస్ఏ లో ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.ఈరోజు ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి కానుంది.ఇందులో ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్ ,ప్రగ్యా జైస్వాల్ ,చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.సాయి సౌజన్య , నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే డాకు మహారాజ్ కు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది.ఎందుకంటే ఈసినిమా కన్నా రెండు రోజుల ముందు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుంది ఈసినిమాపై కూడా భారీ అంచనాలు వున్నాయి.అలాగే రెండు రోజుల తరువాత సంక్రాంతికి వస్తున్నాం విడుదలవుతుంది.ఫ్యామిలీ ఎంటరైనర్ గా వస్తుంది.దాంతో ఈసంక్రాతికి ఈమూడు సినిమాల మధ్య ఆసక్తికర పోటీ ఉండనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























