పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు.ఇది రెండు భాగాలుగా రానుందని తెలిసిందే.100 కోట్లకుపైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా ఎట్టకేలకు పూర్తికావొస్తుంది.రీసెంట్ గా పవన్ మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.మరో 5రోజులు షూట్ చూస్తే తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ కానుంది.ఆతరువాత రాజస్థాన్ లో విలన్ గా నటిస్తున్న బాబీ డియోల్ పాత్ర తాలూకు సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంటుంది.దాంతో షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది. ఈనెలలో ఈ బ్యాలెన్స్ షూట్ ను కంప్లీట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమానుండి మొదటి పాటను ఈరోజు విడుదలచేస్తామని ప్రకటించారు.అయితే అది కాస్త వాయిదా పడింది.సాంగ్ ను మరింత గొప్ప తీర్చిదిద్ది మీకు అందించేందుకు మరి కొంచెం టైం కావాలని అందుకే వాయిదా వేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.అన్ని కుదిరితే సంక్రాంతికి ఈ సాంగ్ విడుదలకానుంది .
హరిహర వీరమల్లును సగానికి పైగా క్రిష్ డైరెక్ట్ చేయగా మిగితా భాగం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.ఈసినిమాలో నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తుండగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.ఏఏం రత్నం నిర్మిస్తున్నాడు.మార్చి 28న హరి హర వీరమల్లు మొదటి భాగం పాన్ ఇండియా మూవీ గా థియేటర్లలోకి రానుంది.
ఇక పవన్ ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు పూర్తి చేయాల్సివుంది.అందులో సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ ఒకటి కాగా రెండోది ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో పవన్ మొదట ఓజీ ను పూర్తి చేయనున్నాడు. దాదాపు సగానికి పైగా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.ఈఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: