ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 హిందీలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.ఇక ఈసినిమా నాలుగో వారంలో కూడా అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ తో వసూళ్లను రాబట్టి 5వ వారంలోకీ ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి తో దేశ వ్యాప్తంగా హిందీ వెర్షన్ 800కోట్ల నెట్ మార్క్ ను క్రాస్ చేసి చరిత్ర సృష్టించింది.ఇప్పట్లో ఈ రికార్డును బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమే అని చెప్పొచ్చు.ఓవరాల్ గా పుష్ప 2 హిందీ వెర్షన్ మొత్తం 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే పుష్ప 2 అన్నిభాషల్లో కలుపుకొని 30 రోజుల్లో 1800కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసింది.ప్రస్తుతం దంగల్ 1900 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం హైయెస్ట్ కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా ఉండగా పుష్ప 2 రెండో స్థానం లో కొనసాగుతుంది.అయితే ఫుల్ రన్ లో దంగల్ రికార్డు ను బ్రేక్ చేయడం సాధ్యపడకపోవచ్చు.
ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే ఈనెల చివర్లో స్ట్రీమింగ్ లోకి వచ్చే ఛాన్స్ వుంది.అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ పుష్ప 2 స్ట్రీమింగ్ హక్కులను తీసుకుంది.ఇక ఈసినిమా ఓటిటి లోకుడా రికార్డు బ్రేకింగ్ వ్యూస్ ను రాబట్టడం ఖాయం.
సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించగా రావు రమేష్, జగపతి బాబు ,జగదీష్ కీలక పాత్రల్లో కనిపించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























