ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. మరో 6రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా సాంగ్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ఇప్పటివరకు 4పాటలు రిలీజ్ కాగా అన్ని చార్ట్ బస్టర్స్ అయ్యాయి.కేవలం ఆడియో పరంగా మాత్రమే కాదు పిక్చరైజేషన్ కూడా అదిరిపోనుందని లిరికల్ వీడియో లు చూస్తేనే తెలిసిపోతుంది. శంకర్ సినిమాల్లో సాంగ్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ గేమ్ ఛేంజర్ లోనూ అన్ని సాంగ్స్ గ్రాండియర్ గా తెరకెక్కాయి.మొత్తం 5పాటలు ఉండగా వీటి కోసం ఏకంగా 75 కోట్లు ఖర్చు పెట్టామని నిర్మాత దిల్ రాజు ఈరోజు జరిగిన ముంబై ఈవెంట్ లో చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు రాజమండ్రి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈసినిమా విజయం పై అయితే టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ట్రైలర్ అయితే ఏకంగా 180మిలియన్లకుపైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.
గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.శంకర్ మార్క్ ఎంటర్టైనెర్ గా రానున్న ఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్, ఎస్ జె సూర్య ,సముద్రఖని ,సునీల్ ,అంజలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందించాడు.జనవరి 10న గేమ్ ఛేంజర్ భారీ స్థాయిలో విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: