సీనియర్ హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ విడుదలకు సిద్ధవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు యూఎస్ఏ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.ఈ ఈవెంట్ కోసం టీం ఇప్పటికే డల్లాస్ చేరుకుంది.ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.భారత కాలమాన ప్రకారం ఉదయం 8:39 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా రిలీజైన థర్డ్ సింగిల్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దాంతో ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.ట్రైలర్ కూడా అదిరిపోయేలా ఉంటే భారీ ఓపెనింగ్స్ ఖాయం.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ ,చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.సాయి సౌజన్య , నాగవంశీ ఈసినిమాను నిర్మిస్తుండగా జనవరి 12న విడుదలకానుంది.
ఇక రిలీజ్ ముందు నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.ఈసినిమా మనందరిది.మీ సపోర్ట్ చాలా అవసరం. అందరం కలిసి సినిమాను ఘనవిజయం చేద్దామని ఈరోజు ట్వీట్ చేశారు.ఇక ఈ సంక్రాంతికి ఈసినిమాతో పాటు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం కూడా విడుదలవుతున్నాయి. దాంతో డాకు మహారాజ్ కు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























