సీనియర్ హీరో బాలకృష్ణ ,యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డాకు మహారాజ్.ఈసినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఇక ఇందులో నుండి ఈరోజు మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు.దబిడి దిబిడి అంటూ వచ్చిన ఈసాంగ్ బాగుంది..బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా , బాలకృష్ణ లపై ఈసాంగ్ ను చిత్రీకరించారు.ఈ సాంగ్ లిరికల్ వీడియో లో ఊర్వశి గ్లామర్ తో ఆకట్టుకోగా బాలకృష్ణ ఎనర్జిటిక్ గా స్టెప్పులు వేస్తూ కనిపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈసినిమాలో బాలకృష్ణను ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా చూపించనున్నాడు బాబీ.ఇందులో శ్రద్దా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ ,చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ , ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.జనవరి 12న విడుదలకానుంది.
ఇక ఈసినిమా కన్నా రెండు రోజుల ముందు రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ వస్తుండగా రెండు రోజుల తరువాత సంక్రాంతికి వస్తున్నాం విడుదలవుతుంది. దాంతో డాకు మహారాజ్ కు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.మరోవైపు హ్యాట్రిక్ సక్సెస్ లతో ప్రస్తుతం పీక్ ఫామ్ లో వున్నాడు బాలకృష్ణ.మరి డాకు మహారాజ్ తనకు వరుసగా నాలుగో విజయాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























