యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్’. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‍గా రిలీజ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తండేల్ సినిమా ప్రమోషన్స్‌ను స్ట్రాటజిక్‌గా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే హీరో, హీరోయిన్ ఫస్ట్ లుక్స్ మరియు ఇతర ప్రచార చిత్రాల ద్వారా సినిమాపై ఏర్పడిన బజ్ కంటిన్యూ అయ్యేలా మ్యూజికల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘బుజ్జితల్లి’ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసింది. 30 మిలియన్లకు పైగా వ్యూస్‌తో అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది.
ఈ నేపథ్యంలో సెకండ్ సింగిల్‌కి సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా దీని ప్రోమోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఫుల్ సాంగ్‌ను రేపు.. అనగా, జనవరి 4వ తేదీ సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నారు. కాశీలోని డివైన్ ఘాట్స్‌లో లాంచ్ చేస్తుండటం విశేషం. ‘నమో నమః శివాయ’ అంటూ సాగే ఈ పాట శివశక్తిని ప్రతిబింబించేలా రూపొందించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ నాగ చైతన్య, సాయి పల్లవి పవర్ ఫుల్ శివ శక్తి ఫోజ్‌లో కనిపించడం ఆకట్టుకుంది. చుట్టూ పెద్ద సంఖ్యలో జనసమూహం, వారి సంప్రదాయ వస్త్రధారణ జాతర ఉత్సాహపూరిత వాతావరణం పాట యొక్క ఆధ్యాత్మిక ఇతివృత్తానికి జీవం పోస్తాయి. ఈ పాటను భారీ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్‌లో చిత్రీకరించారు. పోస్టర్లు హై ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాండ్ స్కేల్‌ని ప్రజెంట్ చేశాయి.
కాగా ఈ జాతర పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇది ఇప్పటివరకు నాగ చైతన్యకు మోస్ట్ ఎక్సపెన్సీవ్ ట్రాక్‌గా నిలిచింది. శ్రీకాకుళం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీ ముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే ఈ పాట సంగీతపరంగా, విజువల్‌గా అద్భుతంగా వుండబోతోంది. ఇక నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. అలాగే నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఇక కథ రీత్యా శ్రీకాకుళం నేపథ్యం ఉండటంతో అక్కడి జాతర్లలో ఆడిపాడే పేరుమోసిన కళాకారులను రప్పించారు. అలాగే దాదాపు 900 మంది డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నట్టు సమాచారం. ఇక ఈ పాట కోసం శ్రీకాకుళం వాతావరణాన్ని తలపించేలా వేసిన భారీ సెట్, పాల్గొన్న కళాకారులు అన్నింటికీ కలిపి సుమారు 3 కోట్లు వరకు ఖర్చు అయిందని యూనిట్ వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందుతోంది. ఈ మూవీని గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చైతూ తన కెరీర్‌లో తొలిసారి లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్ పోషిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: