మలయాళ మూవీ మార్కో తెలుగులో రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.నిన్న విడుదలైన ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు 1.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు మలయాళ డబ్బింగ్ సినిమాల్లో ఇదే హైయెస్ట్.దాంతో మార్కో తొలి రోజు ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ గా నిలిచింది. మోస్ట్ వయోలెంట్ మలయాళం మూవీ గా వచ్చిన మార్కో పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే ఈరేంజ్ వసూళ్లను రాబట్టిందంటే గొప్ప విషయమే.ఎన్వీఆర్ సినిమాస్ ఈసినిమాను తెలుగులో విడుదలచేసింది.మరో వారం రోజుల వరకు పెద్ద సినిమాలు విడుదలకేపోవడం మార్కో కు అడ్వాంటేజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత నెలలో మలయాళం లో విడుదలైన ఈసినిమా సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఇప్పటివరకు అక్కడ 80కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. మార్కో రీసెంట్ గా హిందీ లోకూడా విడుదల కాగా అక్కడ స్లో గా స్టార్ట్ చేసి రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూపోతుంది.నిన్నటి వరకు మార్కో హిందీ లో 5కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది. పుష్ప 2 పోటీ ని తట్టుకొని వసూళ్లను రాబట్టుకుంటుంది.
ఉన్ని ముకుందన్ లీడ్ రోల్ లో నటించిన ఈసినిమాను హనీఫ్ అదేని డైరెక్ట్ చేయగా యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.కెజిఎఫ్, సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై షరీఫ్ ముహమ్మద్ ఈసినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























