ఓవర్సీస్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2

Pushpa 2 The Rule Movie North America Collections

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా విడుదలై 25 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్‌గా రూ. 1,760కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తద్వారా కేవలం 25 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2 రికార్డు సృష్టించింది. అంతేకాదు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాగానూ అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. రూ.1,800 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాహుబలి 2 ఇప్పటివరకూ మొదటి స్థానంలో వుండగా.. ఫుల్ రన్‌లో పుష్ప 2 ఈ కలెక్షన్స్ దాటుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే ప్రధానంగా ఈ చిత్రం హిందీ వెర్షన్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే అక్కడ హైయెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ మూవీ హిందీలో 770.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఫుల్ రన్‌లో రూ.800కోట్ల మార్కును ఈజీగా అందుకోనుంది. ఇంతకుముందు ‘స్త్రీ 2’ చిత్రం రూ.627కోట్ల రికార్డును పుష్ప 2 కేవలం రెండు వారాల్లోనే బ్రేక్ చేయడం విశేషం.

మరోవైపు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం దుమ్ము రేపుతోంది. కళ్ళు చెదిరే వసూళ్లను అందుకుంటోంది. ప్రధానంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రభంజనమే సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం, ఉత్తర అమెరికాలో 15 మిలియన్లకు పైగా కలెక్షన్స్ కళ్లజూసి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ క్రిస్మస్ సీజన్ కావడం, రేపు నూతన సంవత్సరాది ఉండటంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.