గేమ్ ఛేంజర్.. పక్కా ఫెస్టివల్ ఫిల్మ్ అని పేర్కొన్నారు కోలీవుడ్ స్టార్ ఎడిటర్ రూబెన్. ఈ మేరకు ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ మచ్ అవైటెడ్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న ఎడిటర్‌లలో ఆయన ఒకరు. 15 ఏళ్ల కెరీర్‌లో పలు భారీ ప్రాజెక్టులకు వర్క్ చేశారు. ‘రాజా రాణి, వేదాలం, తేరి, రెమో, వివేగం, మెర్సల్, కాంచన 3’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఆయన పనిచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి రూబెన్ సహకారం అందించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించగా.. ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్రఖని తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
కొన్నిరోజుల క్రితం విడుదలైన గేమ్ ఛేంజర్ టీజర్‌తో మూవీ లవర్స్‌ను ఆకట్టుకున్న రూబెన్, త్వరలో విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్‌తో మరోసారి తన ట్యాలెంట్‌ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 10న గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి పనిచేసిన ఎడిటర్ రూబెన్ ఒక ఇంటర్వ్యూలో దీనిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రూబెన్ మాట్లాడుతూ.. “గేమ్ ఛేంజర్ ట్రైలర్ సిద్ధమైంది. స్టోరీ ఎక్కువగా రివీల్ చేయకుండా ప్రేక్షకులకు హై ఫీల్ ఇచేలా ఉంటుంది. ఈ ట్రైలర్ నిడివి రెండు నిమిషాలకు పైనే ఉంటుంది. ఇది కమర్షియల్ హంగులతో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ కథ. అయితే గేమ్ ఛేంజర్ పక్కా పండుగ సినిమా అని చెప్పొచ్చు. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. నేను కమర్షియల్ సినిమాలకు అభిమానిని. ఈ సినిమా చూడటాన్ని, దీనికోసం పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: