సంక్షోభంలో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థను తన మేథస్సుతో గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి, రెండు పర్యాయాలు దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు ఇకలేరు. మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన అస్తమించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కోనేళ్ళుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి స్పృహ కోల్పోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు దాదాపు గంటన్నర పాటు ఆయనకు అత్యవసర చికిత్స అందించినా ఉపయోగం లేకపోయింది.
చివరకు పరిస్థితి విషమించి రాత్రి 9.51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ఆస్పత్రి అధికారిక ప్రకటన చేసింది. అనంతరం మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని గురువారం రాత్రే ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. కాగా మన్మోహన్ సింగ్‌కు భార్య గురుచరణ్, ముగ్గురు కుమార్తెలు ఉపీందర్, అమృత్, దమన్ ఉన్నారు.
ఇక మన్మోహన్ మరణవార్త తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు అందించారు. ఇక ఈ ఏర్పాట్లపై చర్చించేందుకు కేంద్ర క్యాబినెట్ ఈ ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. అలాగే ఆయన గౌరవార్థం కేంద్రం ఏడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది.
మరోవైపు మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ ఎయిమ్స్‌కు చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కర్ణాటకలోని బెలగావీలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో పాల్గొన్న పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.. మన్మోహన్ మరణవార్త తెలిసిన వెంటనే ఢిల్లీకి పయనమయ్యారు.
మన్మోహన్ గౌరవార్థం.. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సహా వచ్చే ఏడు రోజులపాటు నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలనూ రద్దు చేసుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక మన్మోహన్ సింగ్ మృతిపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డిలు తమ సంతాపాన్ని ప్రకటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























