సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల కీలక భేటీ

Tollywood Celebrities Meet Telangana CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పలువురు టాలీవుడ్ ప్రముఖులు భేటీ అవుతున్నారు. ఈ మేరకు టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో చిత్ర పరిశ్రమకు చెందిన 25మంది నిర్మాతలు, 13మంది దర్శకులు మరియు దాదాపు 11మంది స్టార్ హీరోలు సహా సుమారు 50 మంది ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా గురువారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో వీరు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా తెలంగాణ సీనియర్ మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహా తదితరులు కూడా పాల్గొంటున్నారు.

వచ్చే నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా అగ్ర హీరోలు నటించిన పలు భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది.

దీంతో ఈ అంశాలపై చర్చించేందుకు సినీప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. కాగా ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం తదనంతర పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే పరిశ్రమకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా సినీ ప్రముఖులు చర్యలు తీసుకోనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు వీరే..!

హీరోలు:

  • నాగార్జున
  • వెంకటేష్
  • వరుణ్ తేజ్
  • నితిన్
  • కిరణ్ అబ్బవరం
  • రామ్ పోతినేని
  • కళ్యాణ్ రామ్
  • సాయి ధరమ్ తేజ్
  • అడివి శేష్
  • సిద్దు జొన్నలగడ్డ
  • శివబాలాజీ

నిర్మాతలు:

  • దిల్ రాజు
  • అల్లు అరవింద్
  • సురేష్ బాబు
  • నాగబాబు
  • చినబాబు
  • నాగవంశీ
  • డీవీవీ దానయ్య
  • ఏషియన్ సునీల్ నారంగ్
  • సుప్రియ యార్లగడ్డ
  • మురళీమోహన్
  • శ్యామ్ ప్రసాద్
  • కెఎల్. నారాయణ
  • నవీన్ ఎర్నేని
  • వై. రవి శంకర్
  • టీజీ విశ్వప్రసాద్
  • సుధాకర్ రెడ్డి
  • స్రవంతి రవి కిషోర్
  • భోగవల్లి ప్రసాద్
  • సి. కళ్యాణ్
  • భరత్ భూషణ్

దర్శకులు:

  • దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్
  • కె. రాఘవేంద్రరావు
  • త్రివిక్రమ్ శ్రీనివాస్
  • బోయపాటి శ్రీను
  • అనిల్ రావిపూడి
  • బాబీ కొల్లి
  • వంశీ పైడిపల్లి
  • హరీష్ శంకర్
  • కొరటాల శివ
  • ప్రశాంత్ వర్మ
  • సాయిరాజేశ్
  • వశిష్ట
  • వేణు శ్రీరామ్
  • వేణు యెల్దండి
  • విజయేంద్ర ప్రసాద్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.