సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామ్ గోదాల దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మనోజ్ తనకు జంటగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్ర గ్లింప్స్ వీడియో విషయానికి వస్తే ఈ చిత్రంలోని హీరో హీరోయిన్ ఒక కారులో ఒకరిని ఒకరు టీస్ చేసుకుంటూ సరదాగా ఉన్న సమయంలో కార్ బ్రేకులు పనిచేయక ఆ పరిస్థితి మారిపోయి మరో దిశగా పరిస్థితులు వెళ్తుంటాయి.
వి ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మాతగా గొప్ప నిర్మాణ విలువలతో రానున్న ఈ చిత్రంలో ‘నువ్వు నేను’ ఫేమ్ అనితా హస్సానందని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కామెడీ పండించడానికి ప్రభాస్ శ్రీను, ఆలీ నటిస్తుండగా.. ఇటీవల ‘యానిమల్’ సినిమాలో కనిపించిన నటుడు బబ్లూ పృథ్వీ రాజ్ ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నారు.
ఇక ఇందులో అనిత హస్సానందని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రథన్ సంగీతాన్ని అందిస్తుండగా.. మణికంఠం ఎస్ సినిమాటోగ్రఫీ, భవిన్ షా ఎడిటింగ్ చేస్తున్నారు. వీరితోపాటు మరికొందరు అనుభవజ్ఞులు ఈ చిత్రానికి సాంకేత బృందంగా వ్యవహరిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























