గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు గేమ్ చేంజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను ముమ్మురం చేశారు.
ఇప్పటికే గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి వచ్చిన మూడు పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ‘జరగండి, రా మచ్చా, నానా హైరానా’ పాటలు యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మరోసారి శ్రోతల్ని, అభిమానుల్ని కట్టి పడేసేందుకు చిత్ర యూనిట్ ఈ మూవీ నుండి నాలుగో పాటగా ‘ధోప్’ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.
ప్రమోషన్స్‌లో భాగంగా యు.ఎస్‌లోని డల్లాస్‌లో తాజాగా నిర్వహించిన గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ పాటను విడుదల చేశారు. కాగా ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. స్వరకర్త ఎస్. థమన్, రోషిణి జెకెవి, పృధ్వి మరియు శృతి రంజని మోదుముడి తదితరులు ఆలపించారు. సగం తెలుగు, సగం ఇంగ్లీష్ లిరిక్స్ తో ఈ సాంగ్ యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. థమన్ ఇచ్చిన ఫాస్ట్ బీట్ ఉర్రుతలూగించేలావుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: