గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు గేమ్ చేంజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యు.ఎస్‌లోని డల్లాస్‌లో గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా గ్రాండ్ లెవల్లో నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా అభిమానులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. చరణ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “డల్లాస్‌లోని అభిమానులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇక్కడి వారి చూపించిన ప్రేమాభిమానాలతో మాటలు కూడా రావటం లేదు. మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు చూసి ఆశ్చర్యపోయాను. ఆంధ్ర, తెలంగాణల్లో ఉన్నామా! లేక డల్లాస్ వచ్చామా! అని కూడా అర్థం కావటం లేదు.లవ్ యు ఆల్. అందరూ నాపై ప్రేమతో ఇక్కడకు వచ్చినందుకు థాంక్స్.”
“ఓవర్‌సీస్‌లోని ప్రజలే ముందుగా సినిమాను చూస్తారు. ఇక్కడ నుంచే ప్రమోషన్స్‌ను మొదలు పెడుతున్నాం. మా ‘గేమ్ చేంజర్’కు మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి థాంక్స్. ఇంత పెద్ద ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన రాజేష్ కల్లెపల్లి అండ్ టీమ్‌కు స్పెషల్ థాంక్స్. జనవరి 10న రిలీజ్ అవుతోన్న ‘గేమ్ ఛేంజర్’ను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























