సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ‘UI ది మూవీ’ తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇక ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన, నిర్మాత ఎస్.కే.ఎన్ అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. “ఉపేంద్ర గారి ఫంక్షన్ లో ఆయన ఎదురుగా మాట్లాడడం ఒక ప్రివిలేజ్ గా భావిస్తున్నాను. సౌత్ ఇండియాలో మాకు తెలిసిన కల్ట్ సినిమా, కల్ట్ హీరో, కల్ట్ పర్సనాలిటీ ఉపేంద్ర గారు. ఆయన ఆలోచనలకే మేము బిగ్ ఫాన్స్. ఆయన సినిమాని ఏ భాషలో చూసినా అందరూ ఫిదా అయిపోతారు.” అని తెలిపారు.
“చందు గారు, మనోహర్ గారు చాలా పాషనేట్ ప్రొడ్యూసర్స్. లహరి అంటే ఒక బ్రాండ్. వారు ఫిలిం మేకింగ్ లోకి వచ్చి పాన్ ఇండియా సినిమాల్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ చూసినప్పుడు అందరూ ఒక అరటి పండు కోసం కొట్టుకుంటున్నారు. అక్కడే ఉపేంద్ర గారు తన స్టాంప్ వేశారు.” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు ఇండియాని సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ రూల్ చేస్తున్నాయి. ఈ సినిమా మన గీత ఆర్ట్స్ నుంచే రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని అందరూ డిసెంబర్ 20న చూసి ఘనవిజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఉపేంద్ర గారి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































