విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఇది వారి సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం నుంచి ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. కాగా నేడు (డిసెంబర్ 13) వెంకటేష్ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బర్త్ డేను పురస్కరించుకుని బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మేకర్స్ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
వెంకటేష్ డైనమిక్ అండ్ స్టైలిష్ అవతార్ లో కనిపించిన ఈ బ్రాండ్ న్యూ పోస్టర్ అదిరిపోయింది. అలాగే వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఈ ట్రైయాంగిల్ క్రైమ్ డ్రామా నుంచి ‘మీను’ అంటూ సాగే సెకండ్ సింగిల్ ప్రోమోని అభిమానులకు కానుకగా ఇవ్వబోతోంది టీం. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా.. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: