యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా మెకానిక్ రాకీ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు.ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ నుతెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరిచింది.ఇక ఈసినిమా ఓటిటిలోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.అయితే కేవలం తెలుగు లోమాత్రమే అందుబాటులోకి తెచ్చింది.కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి ఈసినిమాను తెరకెక్కించగా మీనాక్షి చౌదరీ ,శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.జేక్స్ బేజాయ్ సంగీతం అందించాడు.ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై రామ్ తాళ్లూరి నిర్మించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విశ్వక్ సేన్ ప్రస్తుతం లైలా అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్నాడు.తనిష్క్ బాఘ్చి సంగీతం అందిస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈసినిమాను నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదలకానుంది.
ఇక ఈసినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకి కూడా కమిట్ అయ్యాడు విశ్వక్ సేన్.జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి, విశ్వక్ నెక్స్ట్ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు.ఫంకీ అనే టైటిల్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రానుంది.ఇందులో ఆషికా రంగనాథ్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: