తేజ్ ఊచకోత ఎలా ఉంటుందో చూస్తారు – రామ్ చరణ్

Global Star Ram Charan Praises Mega Supreme Hero Sai Durgha Tej

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ “కార్నేజ్” టీజర్‌ను లాంచ్ చేశారు. కార్నేజ్‌ వీడియో సాయి దుర్గ తేజ్ విధ్వంసక, ఇంటెన్స్ క్యారెక్టర్ కు స్నీక్ పీక్ అందిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్న కార్నేజ్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. కాగా ఈ చిత్రానికి SYG (సంబరాల ఏటిగట్టు) అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ ని కార్నేజ్ వీడియో ద్వారా రివీల్ చేశారు.

ఇక కార్నేజ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో తేజ్ పై ప్రశంసలు కురిపించారు. చరణ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి, అలాగే మేము ఎంతగానో గుండెల్లో పెట్టుకొని ప్రేమించే మా అభిమానులందరికీ పేరుపేరునా నమస్కారం. ముందుగా తేజ్ కి కంగ్రాచ్యులేషన్స్. ఒక ఫైటర్ లా ఈ టెన్ ఇయర్స్ ని పూర్తి చేశాడు. ఇది బ్యూటిఫుల్ జర్నీ. తేజ్ ఒక మంచి యాక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తి. అది మీ అందరికీ తెలుసు.”

“తను ఒక మంచి తమ్ముడు, మంచి అన్నయ్య, మంచి కొడుకు, మంచి మేనల్లుడు. తను ప్రతి క్యారెక్టర్ కి తపన పడతాడు. కష్టపడతాడు. మీ అందరి సపోర్ట్ వల్లే తను ఇక్కడ ఉన్నాడు. తేజు ఈరోజు ఇక్కడ ఎలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల బ్లెస్సింగ్స్. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. ఆ సమయాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాలని నాకు లేదు. కానీ ఆ మూడు నెలలు మాకు చాలా కష్టమైన సమయం.”

“అంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత తేజు మళ్లీ ఇక్కడ నిల్చున్నాడు అంటే తను మా తేజ్ కాదు మీ తేజు. మీ అందరికీ తేజ్ తరఫున, మా విజయ అక్క తరపున పేరుపేరునా ధన్యవాదాలు. ఇది తేజుకి 18వ ఫిల్మ్. సంబరాల ఏటిగట్టు. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఔట్ స్టాండింగ్ విజువల్స్. రోహిత్ గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్తున్నాను. తను ఫస్ట్ సినిమా చేస్తున్నట్టుగా లేదు. చాలా అద్భుతంగా ఉంది.”

“తేజ్ మీద ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్నందుకు నిర్మాతలు నిరంజన్, చైతన్య గారికి ఆల్ ది వెరీ బెస్ట్. ఇది సినిమా పట్ల వారికి ఉన్న ఫ్యాషన్ ని తెలియజేస్తుంది. ఐశ్వర్య గారికి, ఈ సినిమాలో పని చేస్తున్న టెక్నీషియన్స్ కి ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజు ప్రేమ చాలా బండ ప్రేమ. ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు. అంత గట్టిగా ప్రేమిస్తాడు. ఈ సినిమాతో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి మంచి న్యూస్ కూడా వినిపించాలని కోరుకుంటున్నాను. థాంక్యూ. లవ్ యూ ఆల్” అని అన్నారు రామ్ చరణ్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.