గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో గేమ్ ఛేంజర్ రిలీజ్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా 30 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే ‘జరగండి, రా మచ్చా, నానా హైరానా’ అనే మూడు లిరికల్ సాంగ్స్‌ను విడుదల చేయగా, అవి మ్యూజిక్ లవర్స్‌ని బాగా ఇంప్రెస్ చేశాయి. దీంతో మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
లక్నోలో టీజర్ లాంచ్ చేయడం ద్వారా గేమ్‌ను మొదలుపెట్టిన రామ్ చరణ్, దిల్ రాజులు తమ తర్వాతి ఈవెంట్లను పకడ్బందీగా ప్లాన్ చేశారు. అమెరికాలోని డల్లాస్ లో ఒక స్పెషల్ ఈవెంట్, దాని తర్వాత చెన్నైలో మరో ఈవెంట్, అలాగే జనవరి ఫస్ట్ వీక్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భారీ ప్రమోషనల్ కార్యక్రమాలను ఏర్పాటుచేయబోతున్నారు. ఇలా రిలీజ్ వరకు వివిధ ప్రమోషన్స్‌ను నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్టార్ డైరెక్టర్ సుకుమార్ హాజరుకానున్నారు. అమెరికాలో జరుగనున్న ఈ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇటీవలే పుష్ప 2తో సాలిడ్ హిట్ అందుకున్న సుకుమార్ తన తర్వాతి చిత్రాన్ని రామ్ చరణ్ తో చేయొచ్చని అంటున్నారు. ఇంతుకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో చరణ్ సినిమా వేడుకలో సుకుమార్ మెరవనుండటంతో మెగాభిమానుల్లో దీనిపై కుతూహలం మొదలైంది. మళ్ళీ వీరిద్దరూ కలిసి మూవీ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దీనికి సంబంధించి సుకుమార్ వారికి ఏదయినా క్లారిటీ ఇస్తారా, లేదా అనేది చూడాలి.
ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ పాన్ ఇండియా మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. అలాగే మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా గేమ్ ఛేంజర్ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: