బాలీవుడ్‌లో హవా చూపిస్తోన్న పుష్ప 2.. మరో రికార్డ్

Pushpa 2 Creates Another Record in Hindi

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల ‘పుష్ప 2: ది రూల్‌’.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌కు ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. అల్లు అర్జున్‌ నట విశ్వరూపం, బ్రిలియంట్‌ అండ్‌ జీనియస్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ అత్యద్భుతమైన టేకింగ్‌..మెస్మరైజింగ్‌ కథ కథనాలు వెరసి.. పుష్ప 2 ది రూల్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి, సరికొత్త రికార్డుల మోత.. ఇండియన్‌ సినీ చరిత్రలో పుష్ప 2 సరికొత్త అధ్యాయం లిఖించింది.

ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు.. నాలుగవ రోజు.. ఐదవ రోజు.. ఆరవ రోజు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా ఆరు రోజుల్లో రూ.1002 కోట్లు వసూలు ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ.1000 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ప్రతి భాషలో సునామీలా దూసుకపోతున్న పుష్ప-2 ముఖ్యంగా బాలీవుడ్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లో హిందీలో ఆరు రోజులకు రూ. 375 కోట్లు కలెక్ట్‌ చేసి, ఇప్పటివరకు ఇంత త్వరగా అంటే కేవలం ఆరు రోజుల్లోనే రూ.375 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. దీంతో పాటు పలు రికార్డులు కూడా పుష్పరాజ్‌ కైవసం చేసుకున్నారు.

ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప 2 సాధిస్తుండటం యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తోంది. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇండియా నెంబర్‌వన్‌ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్‌ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు.

పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్, రావు రమేష్, జగపతిబాబు, సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ బండారి, సత్య, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన బాణీలను అందించగా.. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.