హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య బచ్చల మల్లి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అమృత అయ్యర్ తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
బచ్చలమల్లి ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?
- హనుమాన్ షూట్ చేస్తున్నపుడు ఈ కథ విన్నాను.
- స్క్రిప్ట్, క్యారెక్టర్ చాలా నచ్చింది.
- ఇందులో క్యారెక్టర్‌కి కథలో చాలా ఇంపార్టెన్స్ వుంది.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది?
- 80sలో బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది.
- టౌన్ అమ్మాయి అయినప్పటికీ సిటీ కల్చర్ వున్న క్యారెక్టర్‌లో కనిపిస్తాను.
- తను చాలా సెన్సిటివ్, వెరీ ఎమోషనల్ క్యారెక్టర్.
- ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి.
- ఇందులో నాకు, నరేష్ గారి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ వున్నాయి.
- ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది.
నరేష్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
- నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఎలాంటి ఎమోషనైనా పండించగలరు.
- ఆన్ స్క్రీన్ అగ్రెసివ్ క్యారెక్టర్ వుంటుంది. కానీ ఆఫ్ స్క్రీన్ ఆయన చాలా సాఫ్ట్ పర్సన్.
- చాలా ఫ్రెండ్లీ. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్.
హనుమాన్ తర్వాత మీ కథ ఎంపిక ఎలాంటి మార్పు వచ్చింది?
- మొదటి నుంచి మీనింగ్ ఫుల్ క్యారెక్టర్స్ చేయాలనేదే నా ఆలోచన.
- బచ్చలమల్లిలో కూడా చాలా మంచి పాత్ర.
- చాలా మంచి ఎమోషన్స్, కంటెంట్ వున్న సినిమా ఇది.
- తప్పకుండా మంచి హిట్ అవుతుంది.
డైరెక్టర్ సుబ్బు గారి గురించి?
- సుబ్బు గారు చాలా క్లియర్ విజన్ వున్న డైరెక్టర్.
- చాలా ఫోకస్‌గా వుంటారు. ఎమోషన్స్‌ని చాలా అద్భుతంగా తీశారు.
- బచ్చల మల్లి ఎమోషనల్ డ్రామా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.
బచ్చలమల్లి మ్యూజిక్ గురించి?
- ‘సీతారామం’ ఫేం విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమా మ్యూజిక్.
- ఆయన మ్యూజిక్ ఇస్తున్నారగానే చాలా ఆనందంగా అనిపించింది.
- ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
- సినిమా రిలీజ్ తర్వాత మరింతగా కనెక్ట్ అవుతాయి.
నిర్మాతల గురించి?
- రాజేష్ దండా గారితో ఇదివరకే ఓ సినిమా చేయాలి. కానీ అది కుదరలేదు.
- ఫైనల్‌గా ఈ సినిమాలో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది.
- సినిమా అంటే చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్.
- వారి ప్రొడక్షన్‌లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా వుంది.
- ఈ మూవీ జర్నీ చాలా స్మూత్‌గా జరిగింది.
మీకు డ్రీం రోల్స్ ఏమిటి?
- డ్రీమ్ గర్ల్, క్వీన్, ప్రిన్సెస్ రోల్స్ చేయాలని వుంది.
- యాక్షన్ రోల్స్ చేయడం కూడా ఇష్టమే. (నవ్వుతూ)
నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
- ఓ కన్నడ, తమిళ్ సినిమా చేస్తున్నాను.
- తెలుగులోనూ పలు స్క్రిప్ట్స్ వింటున్నాను.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: