ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ప్రపంచవ్యాప్తంగా 12,000కి పైగా స్క్రీన్లలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ అయింది. అంతకుముందురోజు ఏర్పాటు చేసిన బెనిఫిట్ షోలతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్‌లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే, మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా డైలాగ్‌లకు సంబంధించి తీవ్ర చర్చ నడుస్తోంది. మెగా ఫ్యామిలీని ఉద్దేశించి కొన్ని డైలాగ్‌లు ఉన్నాయంటూ రూమర్స్ మొదలయ్యాయి. సినిమాలో ఎలాంటి అభ్యంతరకర మాటలు లేనప్పటికీ.. అల్లు అర్జున్ చెప్పాడంటూ కొన్ని డైలాగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఫేక్ న్యూస్ ప్రచారంపై చిత్రాన్ని రూపొందించిన నిర్మాణ సంస్థ మైత్రీ రంగంలోకి దిగింది. దీనిపై సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు” అని అసహనం వ్యక్తం చేసింది.
అలాగే దీనిపై తాము ఏం చేయబోతున్నామో తెలియజేస్తూ.. “వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం” అని ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: