మహిళా అభిమాని మృతి.. కుటుంబానికి అండగా అల్లు అర్జున్

Pushpa 2 Stampede Allu Arjun Announces Rs.25 Lakh and Medical Assistance To Victims Family

పుష్ప 2 చిత్రం విడుదల నేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ఇదే ఘటనలో ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో ఈ సంఘటనపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఈ మేరకు రేవతి మృతిపై సంతాపం తెలియజేసిన ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. అందులో.. ‘‘అందరికీ నమస్కారం.. పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ని చూసేందుకు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌‌లోని సంధ్య థియేటర్‌కి వెళ్లాం. క్రౌడ్‌ ఎక్కువగా వచ్చింది. సినిమా చూసి వచ్చేశాక మరుసటి రోజు మాకు ఇది తెలిసింది.”

“అది కూడా ప్రీమియర్ చూసేందుకు వచ్చిన ఒక ఫ్యామిలీకి దెబ్బలు తగిలాయని.. ముఖ్యంగా ఇద్దరు పిల్లలున్న రేవతి గారు దురదృష్టవశాత్తు చనిపోయారని తెలిసింది. ఆ విషయం తెలిశాక పుష్ప 2 టీమ్ మొత్తం చాలా బాధపడ్డాం. గత 20 ఏళ్లుగా మేము థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూడటం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. కానీ, మొన్న సడన్‌గా ఇలా జరిగే సరికి చాలా బాధపడ్డాం.’’

‘‘రేవతి గారు మృతి చెందిన వార్త తెలియగానే.. మేము పుష్ప 2 సెలబ్రేషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనలేకపోయాం. మేము సినిమాలు తీసేదే.. ప్రేక్షకులు థియేటర్లకి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటిది థియేటర్‌ వద్ద ఇలా జరగడం చాలా బాధించింది. రేవతి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మేము ఏం చేసినా.. రేవతి గారు లేని లోటుని ఆ ఫ్యామిలీకి తీర్చలేం.”

“కానీ.. ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాం. నా తరఫున రేవతి గారి కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నా. ఆమె కొడుకు ఆసుపత్రి ఖర్చులు కూడా మేమే భరిస్తాం’’ అని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. కాగా ఈ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చిన అల్లు అర్జున్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.