ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో సునీల్, ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, నాలుగు లిరికల్ పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై నగరాలలో జరిగిన ఈవెంట్లకు ప్రేక్షకుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ రావడం జరిగింది.
ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ‘కిస్సిక్’ అనే ప్రత్యేక గీతంలో అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేసిన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల మాట్లాడుతూ.. “నాకు ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడటం ఎంత సంతోషకరంగా ఉంది. పుష్ప సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి నా ధన్యవాదాలు. దర్శకుడు సుకుమార్ గారికి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ పనిచేస్తుంటే.. అందరూ అతలాకుతలం అయిపోతుంది అనుకుంటారు. కానీ మా ఇద్దరినీ (రష్మికను ఉద్దేశించి) చూసి మిగతా వారంతా సెట్స్‌లో అలా అయిపోరు. మా ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉండటం సంతోషకరం. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి, చంద్రబోస్ గారికి, మైత్రి మూవీ మేకర్స్కి, ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: