డిస్నీ లైబ్రెరీలో నా వాయిస్ 200 ఏళ్ళు వుండిపోతుంది

Actor Ali Says, My Voice will Remains For 200 Yrs in Disney Library

మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2019లో లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులని అలరించబోతోంది. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో రిలీజైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులకు స్పెషల్ ట్రీట్‌ ఇస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు అద్భుతమైన పోస్టర్‌ను ఆయన సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని గ్రాండ్ మీడియా ఈవెంట్ లో లాంచ్ చేశారు. టాకా పాత్రకు వాయిస్ హీరో సత్యదేవ్‌, టిమోన్‌ పాత్ర వాయిస్ ఇచ్చిన అలీ ఈ వేడుకలో పాల్గొన్నారు. పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్‌ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు.

ఈ సందర్భంగా యాక్టర్ అలీ మాట్లాడుతూ.. “డిస్నీ వారికి ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ డబ్బింగ్ చెప్పడం వెరీ స్పెషల్. ది లయన్ కింగ్ సినిమా మన అందరికీ నచ్చింది. ఇప్పుడు ముఫాసా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మహేష్ గారు ముఫాసా కి డబ్బింగ్ చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టిమోన్‌ పాత్రకు డబ్బింగ్ చెప్పడం నా అదృష్టం. డిస్నీ లైబ్రెరీలో నా వాయిస్ రెండు వందల సంవత్సరాలు వుండిపోతుంది. ఒక యాక్టర్ కి కావాల్సినది ఇదే. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.