టాలీవుడ్‌లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలలో యువ కథానాయకుడు నాగశౌర్య ఒకరు. ఆయన గతేడాది ‘రంగబలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న ధ్యేయంతో నాగశౌర్య భావిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులక్రితం తన నూతన చిత్రాన్ని ప్రారంభించాడు శౌర్య. డెబ్యుటెంట్ రామ్ దేశిన (రమేష్) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటికే ఈ చిత్రం 60శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ మూవీ లోని కీలక షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి టీం సన్నాహాలు చేస్తున్నారు.
కాగా ఈ మూవీలో నాగ శౌర్య సరసన నటిస్తున్న కథానాయిక ఎవరన్నది చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వి, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమ్మక్ చంద్ర, శివన్నారాయణ తదితరులు నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పనిచేస్తుండగా హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకి కంబ్యాక్ ఇస్తూ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను రాజీవ్ నాయర్ పర్యవేక్షించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: