అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ మెయిన్ గా అల్లరి నరేష్ పాత్రపై ఫోకస్ చేస్తోంది. నరేష్ మాస్ లుక్, అతని పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేస్తూ ఈ మాస్ క్యారెక్టర్‌కి డెప్త్ తీసుకొచ్చింది. అతని ప్రయాణంలో అమృత అయ్యర్ కీలక పాత్ర పోషిస్తుండగా, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష కూడా ఉన్నారు.
ఇక రిచర్డ్ ఎమ్ నాథన్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ పవర్ ఫుల్ స్కోర్ టీజర్ ని మరింత ఎలివేట్ చేశాయి. హాస్య మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. ఎడిటింగ్ ఛోటా కె. ప్రసాద్. సుబ్బు మంగదేవి కథ, సంభాషణలు రాశారు, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, అడిషినల్ స్క్రీన్‌ప్లేకి విశ్వనేత్ర సహకారం అందించారు. టీజర్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది.
ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమా అభిమానులందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. డైరెక్టర్ సుబ్బు గారు మూడేళ్లు ఈ సినిమాతో జర్నీ చేశారు. ఈ సినిమా గురించి తప్ప దేని గురించి ఆలోచించలేదు. అది నాకు చాలా నచ్చింది. ఆయన కథ ఎంత అద్భుతంగా చెప్పారో అంతకంటే అద్భుతంగా సినిమా తీశారు. సినిమా చూశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను.”
“ఈ సినిమాలో సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయి. విశాల్ అండ్ డైరెక్టర్ సుబ్బు గారు దాదాపు 6 నెలలు కూర్చుని ఈ సినిమా కోసం పాటల్ని సిద్ధం చేశారు. చాలా కష్టపడి ఇష్టపడి చేశారు. ఎడిటింగ్ చోటా గారు, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి.. అందరూ కలిసి ఒక టీం ఎఫర్ట్ గా ఈ సినిమా చేశాం. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ గురించి మాట్లాడతారు.”
“ప్రసాద్ బెహరా చాలా మంచి యాక్టర్. చాలా సెటిల్ గా చేస్తాడు. తను పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను. మధుగారు తెర వెనక చాలా కీలక పాత్ర పోషించారు. అమృత గారు దగ్గర్నుంచి ఈ సినిమాలో నటించిన అందరికీ చాలా మంచి పేరు వస్తుంది. బచ్చల మల్లి.. గమ్యం, నాందిలా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే సినిమా అవుతుంది.”
“నాంది చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో, ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నాను. బచ్చలమల్లి డిసెంబర్ 20 తేదీన మీ ముందుకు వస్తుంది. థియేటర్లో అందరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు హీరో అల్లరి నరేష్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: