అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బచ్చల మల్లి’లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో అల్లరి నరేష్, అమృత అయ్యర్ మెయిన్ లీడ్స్‌లో కనిపిస్తుండగా.. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే మూవీపై స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది.
ఈ సందర్భంగా హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ.. “టీజర్ రెస్పాన్స్ చూసినప్పుడు డిసెంబర్ 20 బిగ్ హిట్ అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. బచ్చలమల్లి సినిమాకి వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నరేష్ గారు చాలా అగ్రెసివ్ క్యారెక్టర్ చేశారు. అంత మంచి క్యారెక్టర్ రాసిన డైరెక్టర్ గారికి థాంక్యూ సో మచ్. హాస్య ప్రొడక్షన్లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ పేరుపేరునా థాంక్స్. డిసెంబర్ 20న తప్పకుండా ఈ సినిమా చూడండి” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























