అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బచ్చల మల్లి’లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో అల్లరి నరేష్, అమృత అయ్యర్ మెయిన్ లీడ్స్ లో కనిపిస్తుండగా.. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే మూవీపై స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుబ్బు మంగదేవి బచ్చలమల్లి విశేషాలు వివరించారు. సుబ్బు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. ఈ సినిమా మూడేళ్ల కష్టం. నా డైరెక్షన్ టీం కి థాంక్యూ. నాతో పాటు సమానంగా కష్టపడ్డారు. మధుగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా సక్సెస్ లో సగం క్రెడిట్ ఆయనకి దక్కుతుంది. కరోనా సమయంలో హాస్పిటల్లో ఉన్న మా అమ్మగారిని చూడ్డానికి సరైన సమయంలో వెళ్లలేక పోయాను.”
“అయితే నేను వెళ్లేటప్పుడు అదే చివరి చూపు అయింది. అప్పుడు నాకు అర్థమైంది జీవితంలో ఏ విషయాన్ని కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. లైఫ్ లో వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పు చేయకూడదు కదా అనిపించింది. అది నాకు చాలా బలంగా తాకింది. ఇలాంటి పాయింట్ మీద ఒక కథ చెప్పాలనిపించింది. ప్రతి ఒక్కరూ ఏదో మూమెంట్లో ఒక తప్పు చేస్తారు. అలాంటి ఒక పాయింట్ ని జెన్యూన్ గా చెప్పాలనిపించింది.”
“ఈ పాయింట్ చెప్పడానికి, ఈ సినిమా తీయడానికి నాకు మొదట ఎంకరేజ్ చేసింది నరేష్ గారు. ఆయన లేకపొతే బచ్చలమల్లి అనే క్యారెక్టర్ లేదు. నేను ఎలా చేయమంటే అలా చేశారు. నాకు అంత కంఫర్ట్ ఇచ్చారు. అమృత గారు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కావేరి పాత్రతో కనెక్ట్ అవుతారు. విశాల్ గారితో వర్క్ చేయడం చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























